ఆలస్యం అమృతం విషం అన్నారు. కార్పరేట్ లకి ఈ విషయం మెల్లమెల్లగా అర్ధం అవుతున్నట్టు ఉంది. ఆలస్యానికి మూల్యం చెల్లించుకోవాల్సిన యూనీటెక్ చెల్లించుకుంది ఇప్పుడు పార్స్య నాథ్ డెవలపర్స్ వంతు ఒచ్చేసింది. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తన జాబితా లో కొత్త తలనొప్పులు తెచ్చుకుంది. నోయిడా లో ఇచ్చిన హామీకి సకాలం లో నిర్మాణం పూర్తి చెయ్యని యూనీటెక్ తన వినియోగదారులకి మొత్తం డబ్బి వెనక్కి ఇవ్వాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మొన్ననే సంచలన తీర్పు ఇచ్చిన నేపధ్యం లో రియల్ ఎస్టేట్ రంగం లో మరొక ప్రముఖ సంస్థ కి సుప్రీం షాక్ ఇచ్చింది. ఘజియాబాద్ లో అనుకున్న టైం లోగా నిర్మాణాలు పూర్తి చెయ్యనందుకు గాను ముందుగానే డబ్బులు కట్టిన డబ్భై మంది వినియోగదారులకి మొత్తం డబ్బుని 12 శాతం వడ్డీ తో తిరిగ ఇచ్చేయాలి అని సుప్రీం తీర్పు చెప్పి షాక్ ఇచ్చింది. ఈ తీర్పు మీద యూనీటెక్ ఒప్పుకున్నా పార్స్య నాథ్ ఒప్పుకోలేదు. తమ సంస్థ పరిస్థితి ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు డబ్బుని తిరిగ చెల్లించాలేము అని తెగేసి చెప్పింది. తమ సంస్థ లయబులిటీ లో ఆస్థులూ చూపించిన వారి తరఫున లాయర్ లు కోర్టు ని ఇంకొన్నాళ్ళు గడువు అడగబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: