త్వరలో టీవీలో పీవీ సింధూ కనపడబోతోంది. అదేంటి మొన్నటి వరకూ కనపడింది కదా అంటారా ? ఈ సారి అలా కాదు .. మోడల్ గా కనపడుతుంది మన ఒలంపిక్ ఛాంపియన్. ఒలంపిక్స్ పథకం తో ఆమె రేంజ్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది ఎంతగా అంటే మొన్నటివరకూ ఆమె బ్రాండ్ వ్యాల్యూ ఇరవై లక్షలు ఉండేది కాస్తా రెండు కోట్లకి చేరింది. ఆమెతో తమ వ్యాపారాలు ప్రమోట్ చేయించాలి అనే ఉద్దేశ్యం తో బోలెడు కంపెనీలు క్యూ కట్టేసాయి. అతి త్వరలో ఒక కార్పరేట్ తో సింధూ భాగస్వామ్యం అవ్వబోతోంది. ఆమె కి ప్రస్తుతం మార్కెటింగ్ మీద అంచనా చాలా ఎక్కువగానే ఉంది. కంపెనీలతో డీల్స్ మాట్లాడుతున్న ఆమె సన్నిహితులు వచ్చే వారం లో వాటిని పూర్తిగా ప్రకటిస్తారట. ఒలంపిక్స్ ముందర కూడా ఆమెకి ఆఫర్లు వచ్చినా కూడా సింధూ అవన్నే చెయ్యడానికి ఇష్టపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: