భారత ప్రైవేటు బీమా కంపెనీలు అన్నిట్లో చాలా పెద్దది ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ .. వారు తమ ఐపీఓ ని రేపు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఇన్వెస్టర్ ల నుంచి ఆ కంపెనీ పదహారు వందల కోట్లకి పైగా సమీకరణ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్ విభాగం లో ఒక సంస్థ చేసిన అతిపెద్ద పెట్టుబడుల సమీకరణ అంటే ఇలాగే ఉంటుంది మరి. భారత మార్కెట్ లో ఐపీఓ వస్తున్న మొదటి భీమా కంపెనీ గా ఇప్పటికే రికార్డులకి ఎక్కినా ఈ సంస్థ ఐపీఓ విషయం లో కూడా విపరీతమైన స్పందన దక్కించుకుంది. కాగా, మోర్గాన్ స్టాన్లీ, నోమురా, గోల్డ్ మన్ సాక్స్, ఎల్అండ్ టీ ఎంఎఫ్, బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, ఎడిల్ వైజెస్ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్ తదితర కంపెనీలు ఐసీఐసీఐలో యాంకర్ ఇన్వెస్టర్లుగా పెట్టుబడులు పెట్టి వాటాలను పొందారు. పబ్లిక్ ఇష్యూను లీడ్ చేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లు 20 శాతం వాటాను ముందుగానే తమకు నచ్చిన పెట్టుబడిదారులను, మూలాధార ఇన్వెస్టర్లుగా ప్రకటిస్తూ, వారికి వాటాలను విక్రయించుకోవచ్చన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: