భారత దేశం లో తమ డెవెలప్మెంట్ ప్రోగ్రాం ని పూర్తిగా ఆపెయ్యాలి అనుకుంటున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. బెంగళూరు లో తమ సెంటర్ నుంచి చాలా మంది ఉద్యోగులని తొలగించాలి అని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఇక్కడ ఇప్పుడు ఉద్యోగులని తీసేస్తున్నారు. బెంగళూరు లోని సెంటర్ లో ఇప్పుడు ఇదే షాకింగ్ న్యూస్ గా సాగుతోంది. బెంగళూరు సెంటర్ లో ఇంజినీరింగ్ కార్యక్రమాలు ఆపెసాం అనీ తమకి ఇంతకాలం అండగా ఉన్న ప్రతీ ఉద్యోగికీ కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అయితే వారిని చాలా గౌరవంగా పంపిస్తాం అంటూ ఈ సంస్థ చెప్పుకొచ్చింది. భారత్ తో తమకి ఉన్న అనుభంధం గురించీ ట్విట్టర్ మార్కెట్ ఇక్కడ పెరగడంలో తమ ఉద్యోగుల ప్రమేయం ఎంతవరకూ ఉందొ చెప్పుకొచ్చింది ట్విట్టర్. కాగా, ఇప్పటికే పలువురు ఉద్యోగుల తొలగింపు తేదీని తెలుపుతూ 'పింక్ స్లిప్'లను ఇచ్చిన ట్విట్టర్, మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఆదాయాభివృద్ధి లక్ష్యంగా ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్ బుక్ వంటి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో ఇటీవలి కాలంలో ట్విట్టర్ ఆదాయం, నికర లాభం దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: