అప్పట్లో మ్యాగీ నూడుల్స్ విషయం లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది . గడువు తీరిన మ్యాగీ నూడుల్స్ ని ధ్వంసం చెయ్యమంటూ వచ్చిన ఆదేశాల విషయం లో నేస్లీ ఇప్పుడు సుప్రీం కోర్టు ని ఆశ్రయించింది. గడువు తీరిపోయిన ఐదొందాల యాభై టన్నుల నూడుల్స్ నిల్వల ధ్వంసం చెయ్యడం కోసం అనుమతి ని కోరుతూ సుప్రీం కి వెళ్ళాల్సి వచ్చింది. అంత మొత్తానీ ధ్వంసం చెయ్యాలి అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఒప్పుకోవడం లేదు అని సీనియర్ న్యాయవాది సుప్రీం లో పిటీషన్ వేసారు . సంస్థ తరఫున హరీష్ సాల్వే ఈ పిటీషన్ వేసారు. నేస్లీ సంస్థ గతంలో ఇదే సమస్య ని లేవనెత్తడం తో అటార్నీ జనరల్ ముకుల్ సూచనలు పాటించమని ప్రభుత్వ తరఫున వచ్చిన న్యాయవాదు సలహా ఇచ్చారు.  జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి. నాగప్పన్ తో కూడిన బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: