వ్యాపార విస్తరణ లో భాగంగా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లు కలిసిపోయారు. జియో కి తమ టవర్ లు ఇవ్వడం కుదరదు అని తేల్చేసిన ఎయిర్టెల్ , ఐడియా సంస్థలు చెప్పినప్పుడు షాక్ అయిన ముఖేష్ ఇప్పుడు తెలివిగా తన సోదరుడు అనీల్ ని రంగంలోకి దింపి అతనితో కలిసిపోయాడు. దీంతో జియో కి షాక్ ఇద్దాం అనుకున్న కంపెనీలకి ఎదురు షాక్ తగిలింది. జియోతో రిలయన్స్ ను వర్చువల్ మెర్జ్ చేస్తున్నట్టు అంబానీ సోదరులు ముంబైలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. దీంతో రిలయన్స్ టవర్స్ ను జియో వాడుకోనుంది. ఇలా చేసినందుకు రిలయన్స్ కి బోలెడు ఇంకం ఉంటుంది. దాంతో పటు 4జీ సర్వీసులకి అవసరం అయ్యే స్పెక్ట్రం తమ దగ్గర ఉంది అని అనీల్ చెబుతున్నారు. దీన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారా మరిన్ని గొప్ప సేవలు ఇస్తాం అని ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: