ఆ మధ్య సామ్సంగ్ ఫోన్ లకి ఎక్కడ లేని అపఖ్యాతి ఏర్పడేలా ఫోను లోని బ్యాటరీలు పేలిపోతూ అదొక పెద్ద సంచలనంలా మారిన సంగతి తెలిసిందే. నోట్ 7 వైఫల్యం ఏమో కనీ మొత్తం కంపెనీ కే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. నోట్ 7 వైఫల్యాల‌కు గ‌ల కార‌ణాల‌ను పూర్తిగా బ‌య‌ట‌కు చెప్ప‌డం సాధ్యం కాద‌ని పేర్కొన్న శామ్‌సంగ్ ఆ పోన్లు పేలిపోవ‌డానికి మాత్రం అందులోని బ్యాట‌రీయే కార‌ణ‌మ‌ని పేర్కొంది. సంస్థ నిర్వ‌హించిన అంత‌ర్గ‌త ద‌ర్యాప్తులో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలిపింది. ద‌ర్యాప్తు నివేదిక‌ను ఈనెల 23న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. గెలాక్సీ ఎస్ 8ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న శామ్‌సంగ్ నోట్ 7 వైఫ‌ల్యాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాగా నోట్ 7 వైఫ‌ల్యం అతిపెద్ద టెక్ వైఫ‌ల్యంగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: