తన ప్రత్యర్దులకి చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో రోజు రోజుకూ భారీ ఆఫర్ లు ప్రకటించడం లో బిజీ అయిపొయింది. జియో స్మార్ట్ ఫోన్ యూజర్ ల నుంచి భారీ స్పందన వస్తున్న క్రమం లో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త పెట్టుబడుల మీద జియో దృష్టి పెట్టింది. దానితో పాటు డిజిటల్ సేవల డిమాండ్ లో ఉన్న వృద్ధి అదనపు పెట్టుబడులు, నెట్‌వ‌ర్క్ కెపాసిటి విస్తరణకు ప్రతిపాదించినట్టు ఆ కంపెనీ పేర్కొంది. నెట్వర్క్ కెపాసిటీ పెంచుకోవడానికి ఏకంగా రూ.30 వేల కోట్లను పెట్టుబడి పెట్టబోతున్న‌ట్లు తెలిపింది. ఈక్విటీ ఆఫర్ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని పేర్కొంది. ఈ నూత‌న పెట్టుబడుల వ‌ల్ల‌ తమ బ్యాలెన్స్ షీట్‌పై అప్పుల భారం ప‌డే అవ‌కాశం లేద‌ని తెలిపింది.రూ.10 ముఖవిలువ కలిగిన దాదాపు 6  బిలియన్ల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (9శాతం) జారీ ద్వారా ఈ నిధుల‌ను సమీకరించనున్న‌ట్లు రియలన్స్ జియో సంస్థ పేర్కొంది. ఇందు కోసం ఈ నెల‌13వ తేదీన ఏర్పాటు చేసిన‌ బోర్డ్ సమావేశంలో ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్టు చెప్పింది. ఈ వ్యాపారంపై రిలయన్స్ ఇన్వెస్ట్ చేసే మొత్తం దాదాపు రూ.1.9 లక్షల కోట్లవుతుందని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: