ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మొన్నటికి మొన్న జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్ లని తమ వెబ్సైటు లో అమ్మిన ఈ సంస్థ ఆ తరవాత మహాత్మాగాంధీ ఫోటో ని ముద్రించిన చెప్పులని వెబ్సైటు లో పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఏకంగా వినాయ‌కుడి బొమ్మ‌లున్న స్కేటింగ్ బోర్డుల‌ను సైట్‌లో పెట్టింది. అమెజాన్ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.చండీగ‌ఢ్‌కు చెందిన న్యాయ‌వాది అజ‌య్ జ‌గ్గా వినాయ‌కుడి స్కేటింగ్ బోర్డుల‌పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా తెలియ‌జేశారు. వెంట‌నే వెబ్‌సైట్ నుంచి వాటిని తొల‌గించి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పించాల‌ని డిమాండ్ చేశారు. అమెజాన్‌పై వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరారు. మ‌రోవైపు అమెజాన్ తీరును కేంద్ర‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వ‌రూప్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. భార‌తీయుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌కుండా న‌డుచుకుంటే మంచిద‌ని హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: