అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరవాత ఆ ఎఫ్ఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ ల మీద పడుతోంది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలు అయ్యింది. అంతర్జాతీయంగా మార్కెట్ లు అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా, నిఫ్టీ 8400 పాయింట్ల స్థాయి కంటే కిందికి పడిపోయాయి. ప్రస్తుతం 78 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 27,230 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8411 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది. ఐడియా, సిప్లా,గెయిల్, యస్ బ్యాంక్, ఐషర్ సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన  నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: