ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు 4జీ సర్వీసుల టారిఫ్ విధానాన్ని కూడా ప్రకటించింది. జియో షేర్ లు ఇప్పుడు దూసుకుని పోతున్నాయి. ఏకంగా 11 శాతం పెరిగి మార్కెట్ లో కొత్త ఉత్సాహం నింపేసాయి ఈ కంపెనీ షేర్ లు. జియో టారిఫ్ ధరలు ఆకర్షనీయం గా ఉండడం వినియోగదారుల సంఖ్య పది కోట్లకి చేరుకోవడం దీనికి ప్రధాన కారణం అంటున్నారు. నెలకు రూ.303 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించిన విషయం తెలిసిందే. జియోను మరింత విస్తరిస్తున్నట్టు ముకేశ్ అంబానీ ప్రకటించడంతో మదుపుదార్లు ఈ షేర్లపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. టారిఫ్‌లు అందరికీ అందుబాటులో ఉండడం, ఆమోదయోగ్యంగా ఉండడం.. తదితర అంశాలు కూడా షేర్లు పెరగడానికి కారణమై ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: