బంగారం అనేది ప్రెజెంట్ అవసరాల కోసం కంటే భవిష్యత్తు కోసం చాలా మంది కొంటూ ఉంటారు. బంగారం భవిష్యత్తు ని కాపాడుతుంది అని నమ్మేవారు ఎందఱో ఉన్నారు. ఇప్పుడుప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా సార్వభౌమ బాండ్ లని అందుబాటులోకి తీసుకుని వస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సంయుక్తంగా విడుదల చేయనున్న ఈ బాండ్లు ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో భాగంగా 500 గ్రాముల వరకు పసిడి సెక్యూరిటీలను ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా ఈ బాండ్లను విక్రయించనున్నారు. ప్రారంభంలో పెట్టిన పెట్టుబడిపై ప్రతి ఆరు నెలలకు 2.75 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు. బాండ్ల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒకవేళ ముందుగానే తీసుకోవాలంటే మాత్రం కనీసం ఐదేళ్లు ఆగాల్సిందే. వ్యవధి పూర్తయిన తర్వాత పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెట్టుబడి రాబడిపై పన్ను వర్తించదు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: