ఉచిత మంత్రంతో మార్కెట్ లో అందరికీ చెమటలు పట్టిస్తోంది జియో సంస్థ. మొదట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిపించిన ఈ కంపెనీ జనవరి లో జరిగిన విశ్లేషణ లో ఇతర కంపెనీలు ఇచ్చే స్పీడ్ తో పోల్చుకుంటే వెనక్కి పడిపోయింది. గ‌త నెల‌లో మాత్రం జియో మ‌రోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లో ముందంజలో నిలిచింది. అయితే, 4జీ డౌన్ లోడ్ స్పీడుతో జియో అన్నింటిక‌న్నా ముందుండ‌గా, అప్ లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట. గ‌త‌ నెల‌లో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ కాగా ఐడియా 12.216 ఎంబీపీఎస్, ఎయిర్ టెల్ 11.245ఎంబీపీఎస్, వొడాఫోన్ 8.337ఎంబీపీఎస్‌లతో ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: