ఉచిత మంత్రం తో ఇతర టెలీకాం సంస్థ లని బెంబేలు ఎత్తించిన రిలయన్స్ జియో వచ్చే నెల నుంచీ కొత్త టారిఫ్ ప్లాన్ ని తీసుకుని వచ్చి డబ్బులు కలక్ట్ చేసే పని పెట్టుకున్న సంగతి తెలిసిందే. జియో ఉచిత ఆఫర్ టైం అయిపోగానే ఆ సిం లు అన్నీ వినియోగదారులు పక్కన పడేస్తారు అని రూమర్ లు వచ్చాయి. కానీ బ్రోక‌రేజ్ కంపెనీ బెర్న్ స్టెయిన్ నిర్వ‌హించిన ఓ రీసెర్చ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ఈ రీసెర్చ్‌లో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన యూజ‌ర్లు, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు పాల్గొన్నారు.
ఈ రీసెర్చ్ ద్వారా రిల‌య‌న్స్ జియోకు క‌స్ట‌మ‌ర్లు జై కొడుతూనే ఉంటార‌ని తేలింద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. కేవలం 8 శాతం మంది జియో వినియోగ‌దారులు మాత్రమే ఆ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అంతేకాదు, జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తేనే అలా చేస్తామ‌ని అన్నారు. రిల‌య‌న్స్ జియో మంచి  సర్వీసు, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ అందిస్తోంద‌ని వినియోగ‌దారులు తెలిపారు. వ‌చ్చే నెల 1 నుంచి ఆ కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లుగా నెలకు రూ.303 రీఛార్జీ చేసుకుని ఆ సిమ్‌నే సెకండ‌రీ సిమ్‌గా వాడ‌తామ‌ని 67 శాతం మంది యూజర్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: