రోజు రోజుకీ భారత దేశం లో డబ్బున్నోడు ఇంకా ఉన్నాడుగా మారుతూ ఉంటే , లేనోడు ఇంకా లేనోడుగా అవుతున్నాడు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం బిల్లియనీర్ ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ సంవత్సరం జాబితాలో బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,538 కోట్లు) కన్నా అధిక సంపద ఉన్నవారి సంఖ్య 101కి చేరింది. ఎప్పటిలానే ఈ జాబితాలో ముఖేష్ అంబానీ టాప్ లో నిలువగా, అత్యధిక బిలియనీర్లను కలిగున్న దేశాల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 565 మంది బిలియనీర్లతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 319 మందితో చైనా, 114 మందితో జర్మనీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ముఖేష్ అంబానీ 23.2 బి. డాలర్ల సంపదతో ప్రపంచస్థాయిలో 33వ స్థానంలోను, ఇండియాలో మొదటి స్థానంలోను నిలిచారు. ఆయన సోదరుడు అనిల్ అంబానీకి 745వ స్థానం లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: