వరుసగా ఆరు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధరలు ఈ రోజూ అదే బాట పట్టాయి. బులియన్ ట్రేడింగ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.175 తగ్గి రూ.28,550కి చేరింది. అదేవిధంగా కిలో వెండి రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. ఈ సందర్భంగా  ట్రేడింగ్ వర్గాలు మాట్లాడుతూ, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్ తో పోలిస్తే రూపాయి బలపడటంతో బంగారం ధర తగ్గిందని, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్ల వెండి ధరలు తగ్గాయని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: