1000కి పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసిన భారత విమానయాన కంపెనీలు ఇండియాను మూడవ అతిపెద్ద పాసింజర్ విమానాల కొనుగోలు దేశంగా నిలిపాయి. అత్యధికంగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశాల్లో తొలి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా ఉండగా, 3వ స్థానంలో నిలిచిన భారత్ కు భవిష్యత్తులో 1,080 విమానాలు డెలివరీ కానున్నాయి.


ఈ విషయాన్ని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో వివిధ ఎయిర్ లైన్స్ కు చెందిన 480 విమానాలు ఉండగా, వీటి సంఖ్య వచ్చే ఐదారేళ్లలో 1500 దాటనుంది. కాగా, కొత్త ఆర్డర్లలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్ లు అత్యధిక ఆర్డర్లు ఇచ్చాయి. త్వరలో జెట్ ఎయిర్ వేస్, విస్తారా సంస్థలు మరిన్ని విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: