వస్తు , సేవల పన్ను GST దెబ్బతో ఇప్పుడు వినియోగదారులు ఆఫర్ల వర్షం లో తడుస్తున్నారు. తమ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అన్ని రిటైలింగ్ సంస్థ లూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.


బిగ్ బజార్ దగ్గర నుంచీ అమెజాన్ వరకూ అందరూ లెక్కకు మిక్కిలి ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారుడిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫీచర్ గ్రూప్ లో ప్రధానమైన సంస్థ బిగ్ బజార్ రేపు అర్ధరాత్రి అంటే 30తేదీ అర్ధరాత్రి నుంచి 22 శాతం తగ్గింపుతో విక్రయాలు ప్రారంభించనుండగా బుధవారం రాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.


అమెజాన్ సంస్థ ఇప్పటికే యాభై శాతం డిస్కౌంట్ తో తమ వస్తువులు అన్నీ అమ్మేస్తోంది. దాదాపు లక్ష రూపాయల టీవీ ని అరవై వేలకే అమ్మేస్తోంది ఆ సంస్థ. కానీ ఏ బ్రాండ్ ఏంటి అనేది మాత్రం చెప్పడానికి అమజాన్ నిరాకరణ చూపింది.


షాపింగ్ చెయ్యడానికి ఇంతకంటే బెస్ట్ టైం లేదు అంటున్నారు నిపుణులు కూడా. GST  కారణంగా మార్జిన్ తగ్గడం లాభాలు తగ్గే ఛాన్స్ ఉండడం తో ఇప్పుడు ఉన్న స్టాక్ అంతా పూర్తి చెయ్యాలి అనేది అందరు రిటైలర్ ల ప్లాన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: