ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ కంపెనీ లలో ఆటోమేషన్ , వ్యాపారం దెబ్బ తినడం తో ఉద్యోగాలు ఒక్కొక్కటి గా పోతున్నాయి. అన్ని ఐటీ కంపెనీ ల లాగానే మైక్రో సాఫ్ట్ కార్పరేషన్ కూడా అదే కష్టాల్లో నడుస్తోంది. ఈ సంస్థ రీ ఆర్గనైజేషన్ లో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కార్యకలాపాలని పూర్తిగా సమీక్షించనున్నామని , వీరి స్థానం లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ , క్లౌడ్ ప్లాట్ ఫాంలను వినియోగించాలని భావిస్తున్నామని, దీని ఫలితంగా ఫీల్డ్ సేల్స్ తదితర విభాగాల్లో వేలమందిని తొలగించాల్సి రావచ్చని సంస్థ అధికారి ఒకరు చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది.


పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆయన, మార్చి నాటికి సంస్థలో 1,21,567 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని వారి మెడపై కత్తి వేలాడుతున్నట్టని అన్నారు. తమ ఉద్యోగులకి ప్రత్యెక లేఖ రాసిన ఈ సంస్థ కమర్షియల్ సేల్స్ విభాగాన్ని రెండు సెగ్మెంట్ లు గా విభాజిస్తున్నట్టు తెలిపింది. ఒక భాగం పెద్ద కస్టమర్ లకీ రెండో భాగం చిన్న కస్టమర్ లకీ సేవలు ఇస్తుంది అని చెబుతోంది. ఉద్యోగులను ఉత్పత్తి, ఆర్థిక సేవలు, రిటైల్, వైద్యం, విద్య, ప్రభుత్వాలకు సేవలు అంటూ ఆరు విభాగాలుగా విభజించామని పేర్కొంది.


సాఫ్ట్ వేర్ అమ్మకాలను నాలుగు విభాగాలుగా విభజించామని, మోడ్రన్ వర్క్ ప్లేస్, బిజినెస్ అప్లికేషన్స్, యాప్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా అండ్ ఏఐగా మార్చనున్నామని తెలిపింది. త్వరలో వేలాది ఉద్యోగాలు తీసేయ్యాలసి వస్తుంది అని సంస్థ లేఖలో పేర్కొనడం తో షాకింగ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఉద్యోగులు. మైక్రో సాఫ్ట్ లో జాబ్ కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: