గత కొంత కాలంగా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత దేశంలో ఎన్నో అధునాతనమైన ఉత్పత్తులు తన ఆన్ లైన్ మార్కెట్ ద్వారా అందజేస్తుంది.  మరో వైపు కొత్త కొత్త వ్యాపార రంగ సంస్థల్లోకి అడుగు పెడుతుంది.  ఈ మద్య భారత్ మార్కెట్ లో  ‘ఫైర్‌ టీవీ స్టిక్‌’ పేరుతో మరో సరికొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. దీని ధరను అమెజాన్‌ రూ.3,999గా నిర్ణయించింది.
Image result for ‘ఫైర్‌ టీవీ స్టిక్‌
ప్రస్తుతం ఈ ఫైర్‌ స్టిక్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌తో సహా 3,000కిపైగా యాప్స్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని ఆ యాప్స్‌ ద్వారా లభించే ఆడియో, వీడియో కంటెంట్‌ పొందవచ్చు. ఆ టీవీలో నేరుగా యూట్యూబ్‌ ప్రసారాలు చూడొచ్చు.. లేదా వీడియో కాలింగ్‌ చేసుకోవచ్చు..గేమ్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆడుకోవచ్చు.. మీ స్మార్ట్‌ నుంచి కాస్ట్‌ ద్వారా వీడియోలు ప్లేచేసుకోవచ్చు.. లేదా మొబైల్‌ తెరని టీవీలో చూసుకోవచ్చు.. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్‌ ద్వారా చేసే చాలా యాక్టివిటీస్‌ సులభంగా చేయోచ్చు.  
Related image
ఈ యాప్స్‌ కాంటెంట్‌లో 90 శాతం ఉచితంగా లభిస్తే మిగతా 10 శాతాన్ని సబ్‌స్ర్కిప్షన్‌ ద్వారా పొందవచ్చు.వాయిస్‌ రిమోట్‌ ద్వారానూ ఈ ఫైర్‌ స్టిక్‌ సాయంతో హెచ్‌డి టీవీలో కాంటెంట్‌ పొందవచ్చు.  అమెజాన్‌.ఇన్‌లో ఇటీవల జరిగిన ప్రైమ్‌ డే అమ్మకాల్లోనూ అత్యధికంగా అమ్ముడైన టాప్‌-5 ఉత్పత్తుల్లో ఫైర్‌ టీవీ స్టిక్‌’ ఒకటని కౌశిక్‌ చెప్పారు. ఈ ఫైర్‌ టీవీ స్టిక్‌ కొనుగోలు చేసే వారికి అమెజాన్‌ 100 జిబి డేటా ఉచితంగా అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: