భారత దేశంలో టెలికం రంగంలో ఎన్నో పెను మార్పులు తీసుకు వచ్చిన రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫైను రూ. 999కే అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. రూ. 1999 ధర ఉన్న ‘జియో ఫై’ పరికరంపై వెయ్యి రూపాయల తగ్గింపును ఇస్తున్నామని, ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి ౩౦ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో పేర్కొంది.4జీ ఫోను లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని ‘జియో ఫై’ కల్పిస్తుంది.
Image result for Jio 4G VoLTE Wifi Dongle
జేబులో పెట్టుకొని తీసుకెళ్ళగలిగే ఈ బుల్లి పరికరంతో, వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్‌లలో జియో 4జీ సేవలను పొందవచ్చు.స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వైఫై పరికరాలను జియో ఫైతో అనుసందానం చేసుకోవచ్చు. 2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగవచ్చు. ప్రతీ ‘జియో ఫై’తో ఒక జియో సిమ్ వస్తుంది.
Image result for Jio 4G VoLTE Wifi Dongle
ఈ పరికరంలో సిమ్ వేసిన తరువాత ఇది వైఫై హాట్ స్పాట్‌గా పనిచేస్తుంది. ఆ తరువాత ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అవగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4జీ డేటా సేవలను పొందవచ్చు.

అంతేకాదు వినియోగదారులు స్పష్టమైన హెచ్‌డీ వాయిస్ తో జియో నెట్ వర్క్ లో ఉండే వారితో మాట్లాడగలరు. కాగా ఈ డివైజ్ మొదటిసారిగా సెప్టెంబర్ 2016లో లాంచ్‌ కాగా  అప్పట్లో దీని ధర రూ. 2,899 ఉండేది. ఆ తర్వాత దీని ధరని రూ. 1,999గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: