గత కొంత కాలంగా మొబైల్ యూజర్స్ కి నెట్ వర్క్ సంస్థలు పోటీ పడీ మరి ధరలు తగ్గిస్తున్నాయి. కొత్త కొత్త ఆఫర్లతో కంపెనీల మద్య పోటీ ఏర్పడటంతో యూజర్ చార్జీలు చాలా వరకు తగ్గిస్తున్నారు. తాజాగా దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ దిగ్గజాలతో సై అంటోంది. జియో, Airtelకి ధీటుగా బంఫరాపర్లను ప్రకటిస్తూ పోతోంది.
మొన్నటికీ మొన్న రూ. 399కే 90 జిబి డేటాను ఆరునెలల పాటు అందించిన విషయం తెలిసిందే. వొడాఫోన్ సరికొత్త సూపర్‌వీక్ ప్లాన్ లో భాగంగా రూ.69కే యూజర్లకి అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, 500 ఎంబీ డేటాను వారం పాటు అందించనుంది. ఈ ఆఫర్‌ని వినియోగదారుల మరచిపోకముందే మరో సరికొత్త వీక్లీ ఆఫర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.69 అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.
ఇప్పటికే రూ.399 ప్లాన్‌తో 90 జీబీ 4జీ డేటాను ఆరు నెలల పాటు అందిస్తోంది. దీన్ని మీరు ఒకరోజులో కూడా వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ కూడా ఉంటాయి.ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రూ.52తో మరో సూపర్‌వీక్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనికింద అపరిమితంగా వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్‌ను, 250ఎంబీ 3జీ, 4జీ డేటాను అందిస్తోంది.