సోమవారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన భారీ కోతలతో కూడిన పన్ను సంస్కరణలకు అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర నేపథ్యంలో నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టిన మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 135 పాయింట్ల లాభంతో 32,968 వద్ద సెన్సెక్స్‌ కొనసాగుతోంది. 53 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,175 వద్ద కొనసాగుతోంది. 


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో మెటల్‌ రంగ షేర్లకు సూచీగా ఉన్న నిఫ్టీ మెటల్‌ మాత్రం మెరుపులు పుట్టిస్తోంది. ఎన్‌ఎండీసీ జిందాల్ స్టెయిన్‌లెస్‌ (హిసార్) లిమిటెడ్, హిందాల్కో , వేదాంత , జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌తోపాటు, బయోకాన్‌ 10 శాతంపైగా దూసుకెళ్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: