భారత దేశంలో గత సంవత్సరం నుంచి టెలికాం రంగంలో సునామీలా దూసుకువచ్చి సంచలనాలను సృష్టించింది రిలయన్స్ జియో. ప్రారంభంలోనే 6 నెలలు ఉచితంగా సేవలు అందించిన జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ తోకొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందిస్తూ వస్తుంది.  దీంతో వినియోగదారులు ఎక్కువగా జియో నెట్ వర్క్ కే ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు.  దేశ వ్యాప్తంగా ఉన్న టెలికాం నెట్‌వర్క్‌లలో జియో ద్వారా వినియోగదారులకు అందుతున్న మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావడం విశేషం.

ఇక మొబైల్ డేటా ప్యాక్‌ల ధరలు కూడా ఇతర టెలికాం కంపెనీల కన్నా తక్కువగానే ఉన్నాయి.  తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జియో తాను అందిస్తున్న డిస్కౌంట్ రేట్లకు ఫుల్‌స్టాప్ పెట్టి మొబైల్ డేటా చార్జిల ధరలను పెంచాలని  చెందిన వైర్‌లెస్ కవరేజ్ మ్యాపింగ్ సంస్థ ఓపెన్ సిగ్నల్.. విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018వ సంవత్సరం ప్రారంభంలోనే జియో తన మొబైల్ డేటా ధరలను పెంచవచ్చని తెలిసింది.

పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ డేటా టారిఫ్‌లను పెంచితే లాభపడవచ్చని జియో భావించిస్తున్నదట. అందుకే ఆయా చార్జీలను పెంచే అవకాశం ఉందని తెలిసింది.

టారిఫ్ ఛార్జీల పెంపుపై 2018 ప్రారంభంలోనే రిలయన్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2018 నుంచి 2020 మధ్య కాలంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్యతోపాటు 4G డేటా సేవలను వాడే వారి సంఖ్య కూడా ఎన్నో రెట్లు పెరుగనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: