గత నెలలో భారత దేశంలో పసిడి కి బాగా డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.  ప్రస్తుతం శుభకార్యాలేవీ లేకపోవడం, అంతర్జాతీయంగా తగ్గుతున్న ధరలు బంగారాన్ని కిందకు తెస్తున్నాయి. గడచిన 12 రోజుల్లో భాగారం ధర రూ. 1,500కు పైగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 27,310 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,190గా ఉంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచ‌నాల కార‌ణంగా బంగారం డిమాండ్ ప‌డిపోతోంది.  స్థానిక బంగారం దుకాణదారుల నుంచి కూడా కొనుగోళ్లు ప‌డిపోయాయి. స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఈక్విటీల వైపు తరలుతున్నాయని, అందువల్లే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో 99.9 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.29,400గా ఉండ‌గా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.29,250గా ఉంది. గ్లోబ‌ల్ మార్కెట్లో ప‌సిడి ధర 0.54 శాతం తగ్గి, ఒక్కో ఔన్స్‌కు 1,241.40 డాలర్ల‌కు చేరింది. మ‌రోవైపు వెండి కూడా రూ.25 తగ్గి, కేజీకి రూ.37,775కి చేరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: