2019 ఎన్నిక‌లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఊహించ‌ని విధంగా రాజ‌కీయ వేడి ఉండ‌బోతుంది!  త‌ను పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ గ‌ద్ద‌ర్ అభిపాయం చెబుతూనే వ‌స్తున్నారు. నాటి చిన్న నాటి నుంచే గ‌ద్ద‌ర్ పాట‌ల‌ను వినేవాడినని, గ‌ద్ద‌ర్ పెద్ద ఫ్యాన్ న‌ని  చెప్పుతూ వ‌చ్చారు. కానీ ఈ సారి ఆయ‌న మ‌రో స్టెఫ్ ముందుకు వేసి గ‌ద్ద‌ర్ తో ఎన్నిక‌ల్లోకి రావాల‌ని ఆశ‌తో ఉన్న‌ట్టు స‌మాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్ లో కూడా తామే అధికారం లోకి రావాలని అధికార పక్ష నాయకులు వాగ్దానాలు అమలు చేయడం లో బిజీగా  ఉన్నారు.  


ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ సారి ఎలా అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ చేసిన పనులను వాటి లోపాలను ఎత్తి చూపడంలో తెగ కష్టపడుతున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ యుద్దా లు వచ్చే ఏడాదికి ఇంకా తీవ్ర స్థాయిలో పెరగనున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల్లో చెప్పుకోవాల్సింది పవన్ జన సేన పార్టీ గురించి. అన్నయ్యను పక్కన బెట్టి రాజకీయాల్లో రోజు రోజుకి తన స్థాయిని పెంచుకుంటున్నాడు. 

ఇప్పటికే చాలా మంది పవన్ కళ్యాణ్ తమ నాయకుడు అవ్వాలని ఎదురు చూస్తున్నారని కొందరు మాజీ రాజ కీయ నాయకులూ భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ గొడవలతో సభలను నిర్వహిస్తున్న అధికార పక్ష నేతలు మరియు ప్రతి పక్ష నేతల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని అందుకే ఈ సారి పవన్ వైపు మొగ్గు చూపే ఆవకాశం ఉందంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని అభివృద్ధి చేస్తానన్న పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహ రచన చేయబోతు న్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపి లో కొంత మంది యువతను,మాజీ ఉన్నతాధికారులను ఫైనల్ చేశారని. అలా గే తెలంగాణలో కూడా పవన్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ ప్రజా గాయకుడు గద్దర్ పవన్ కళ్యాణ్ ని కలిసి ముచ్చటించారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ గద్దర్ మాత్రం అలంటి రాజకీయాలు ఏమి మాట్లాడుకోలేదని ఆ కథనాలను కొట్టి పారేశాడు. 

రీసెంట్ గా ఆయన ఓ ప్రముఖ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జే శాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏమి మారలేదంటూ. కేవలం నాయకులు మాత్రమే మారారని కొం దరి నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని తెలిపాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. దక్షిణ భారత  సం స్కృతి మీద పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను.ఆ విషయంపై ఆయనతో చర్చలు జరిపాను.అంతే గాని జనసేన పార్టీ విషయంపై తమ మధ్య సంభాషణ జరగలేదు. 

సౌత్ ఇండియన్ కల్చరల్ అనే ఒక అసోసియేషన్ ను స్థాపించాము, భావసారూప్యతకు సాంస్కృతికోద్యమం చాలా అవసరం అంటూ.. పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి అని గద్దర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దాదాపు పవన్ తో సన్నిహితంగానే ఉన్న గద్దర్ వచ్చే ఎలక్షన్ లో ఆయనతో కలిసి నడుస్తారని . అంతే కాకుండా గద్దర్ తెలంగాణలో ఒక ప్రముఖ ప్రజా గాయకుడు కావడంతో జనసేన పార్టీకి కూడా బలాన్ని చేకూరుస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: