మన చదువుకు, మన అర్హతలకు మించని ఉద్యోగాలను మనం ఎంచుకున్నట్లయితే ఇంటర్య్వూ దశలోనే మనల్ని వెనక్కి తిప్పిపంపేస్తారనేది చాలామందికి అనుభవం అయి ఉండవచ్చు. పైగా ఇలా ఉద్యోగ స్థాయికి మించి చదువులు, అర్హతలు, అనుభవం ఉన్నవారు సదరు కంపెనీలకు నష్టకరమే కానీ లాభదాయకం కాదనే అభిప్రాయం దశాబ్దాలుగా రాజ్యమేలుతూ వచ్చింది. అయితే ఉద్యోగ అవసరాలకు మించిన  అర్హతలు ఉద్యోగుల్లో ఉంటే అది కంపెనీ యజమానులకు మేలే చేకూరుస్తుందని తాజా సర్వే తెలిపింది.

 

నోటర్ డేమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జాస్మిన్, కైఫెంగ్ ఈ కొత్త విషయాన్ని వెల్లడించారు. చైనాలోని 11 ఐటీ సంస్థల్లో ఆరునెలలపాటు ఇంటర్వ్యూలు, అధ్యయనాలు చేసిన వీరిద్దరూ సరికొత్త విషయం కనుగొన్నారు. అధిక అర్హతలు ఉన్న ఉద్యోగులు తాము మాత్రమే ప్రముఖ వ్యక్తులంగా లేమని గుర్తించినప్పుడు ఓవర్ క్వాలిఫికేషన్ అనేది వారి గ్రూపులో ఒక మినహాయింపుగా కాకుండా ఒక విధానంగా ఉంటూ వచ్చినప్పుడు వారు తమ అధిక అర్హతలపై మరింత సానుకూల స్పందనలు కలిగి ఉండి మరింత మెరుగ్గా బాధ్యతలను నిర్వహిస్తారని వీరు కనుగొన్నారు.

ఓవర్ క్వాలిఫికేషన్ అనేది పనిస్థలంలో సాధారణీకరించబడినప్పుడు ఉద్యోగ నిర్వహణ, పౌరసత్వ ప్రవర్తనలపై అది సానకూల ప్రభావాన్ని కలిగి ఉంటుందన్న అవగాహనతో మేనేజర్లు ప్రయోజనం పొందగలరని హూ చెప్పారు.

ఇలా అవసరానికి మించిన అర్హతలు కలిగిన వారిని నియమించినప్పుడు వీరు అత్యున్నత అర్హతలు గల గ్రూప్‌తో కలిసి పని చేస్తారన్న అంశాన్ని ఎత్తిపట్టడం ద్వారా ఓవర్ క్వాలిఫికేషన్ కల ఉద్యోగులు ఒక మంచి కంపెనీలో ఉంటున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ కెంపెనీలు సెలబ్రేట్ చేసుకోవాలని పరిశోధకురాలు హూ చెప్పారు.

 

మొత్తంమీద అధిక అర్హతలు కలిగి ఉంటే ఉద్యోగాలు రావు, ఇవ్వరు అనే భయంతో తమ చదువులను, అర్హతలను తక్కువ చేసి చూపుతున్న ఉద్యోగార్ధుల వెతలకు ఇన్నాళ్లకు ఒక వెసలుబాటు వస్తోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: