తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత ఇక్కడ నిరుద్యోగులకు ఎన్నో ఉపాది పనులు కల్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంతే కాదు విద్యావంతులకు అర్హత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో  తెలంగాణలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిఎస్ టెట్) ‘కీ’ ని నేడు విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ ‘కీ’ నిన్ననే విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఒకరోజు ఆలస్యం అయ్యిందని కన్వీనర్ జగన్నాథ రెడ్డి వెల్లడించారు.

ఒకవేళ టెట్ పరీక్ష ప్రశ్నలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 26 వరకు ఫిర్యాదులు  చేయవచ్చని ఆయన అన్నారు. టెట్ ‘కీ’ ని tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: