ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీ ఎప్పుడూ నుండి ప్రారంభం అవుతుందో అని నిరీక్షిస్తున్న సమయంలో వీరి నిరీక్షణకు తెర దించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 10 రోజుల పాటు కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీతోపాటు జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.  యూనివర్సిటీలో ప్రొఫెసర్ సంజీవరావు, పుల్లారెడ్డి కాలేజిలో ప్రిన్సిపాల్ విజయభాస్కర్, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.


9 నుంచి ఆప్షన్ల ఎంపిక
9వ తేదీ నుంచి ర్యాంకుల వారీగా ఆప్షన్ల ఎంపిక జరగనుంది. 9వ తేదీ నుంచి 10వ తేది వరకు 1 నుంచి 35వేలు, 11 నుంచి 12వ తేదీ వరకు 35,001 నుంచి 60వేల వరకు, 13, 14న 60,001 నుంచి 90వేల వరకు, 15, 16న 90,001 నుంచి 1,20,000, 17, 18న 1,20,001 నుంచి చివరి ర్యాంకు అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్ల మార్పునకు 19, 20వ తేదిల్లో అవకాశం కల్పిస్తారు. 22వ తేదిన కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.
 

15వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన
6వ తేదీ 1 నుంచి 5వేలు, 7న 5001 నుంచి 20వేలు, 8న 20001 నుంచి 35వేలు, 9న 35,001 నుంచి 50వేలు, 10న 50,001 నుంచి 65వేలు, 11న 65,001 నుంచి 80వేలు, 12న 80,001 నుంచి 96వేలు, 13న 96,001 నుంచి 1,12,000, 14న 1,12,001 నుంచి 1,28,000, 15న 1,28,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: