ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సంపాదించాలన్నా, కెరీర్‌లో పైకి ఎదగాలన్నా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తప్పనిసరి. ఈ భాషపై పట్టు సాధించడం ద్వారా కెరీర్‌కు సంబంధించి స్వేచ్ఛాలోచన, సృజనాత్మకత అలవడతాయి. ఇంగ్లిష్‌పై పట్టుతో స్పష్టంగా, మరింత ప్రయోజనాత్మకంగా కమ్యూనికేట్ చేయొచ్చు. మల్టీనేషనల్ కంపెనీలు నియామక ప్రక్రియలను ఇంగ్లిష్‌లోనే చేపడుతున్నాయి. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మెరుగ్గా ఉన్నవారు జాబ్ మార్కెట్లో ఇతరుల కంటే ముందుంటారనడంలో సందేహం లేదు. ‘నో బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లిష్... నో జాబ్ అండ్ నో కెరీర్’.. అందువల్ల సమున్నత కెరీర్‌కు ఇంగ్లిష్ తప్పనిసరి. 



ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎందుకు?
ఇప్పుడు కెరీర్‌లో స్థిరపడేందుకు ఏ రంగాన్ని ఎంచుకున్నా అభ్యర్థికి ఉండాల్సిన నైపుణ్యాలలో ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్స్ ప్రధానంగా వినిపిస్తోంది. రిక్రూటర్స్ ఇంటర్వ్యూల్లో సబ్జెక్ట్ పరిజ్ఞానం కంటే ఈ నైపుణ్యాలపైనే దృష్టిపెడుతున్నారు. ఇంగ్లిష్ స్కిల్స్ ఉన్నవారు వ్యక్తిగతంగా, బృంద స్ఫూర్తి తో సమర్థవంతంగా పనిచేయగలుగుతారని కంపెనీలు నమ్ముతున్నాయి. మంచి భావ ప్రసార నైపుణ్యాలు ఉన్న వ్యక్తి మంచి సంబంధాలను కొనసాగించగలడు. కమ్యునికేషన్‌లో ముఖ్యమైనది భాష. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగావకాశాలు ఇం గ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగానే లభిస్తాయి. ఉద్యోగంలో చేరడానికే కాకుండా... పనిచేసే చోట పదోన్నతులు పొందేందుకు కూడా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ దోహదపడతాయి.



ఇంగ్లిష్‌లో ఏం నేర్చుకోవాలి?
ఇంగ్లిష్‌కు సంబంధించి యాక్టివ్ లిజనింగ్, ఎఫెక్టివ్ స్పీకింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్, రైటింగ్ స్కిల్స్ వంటి ఆంగ్ల భాషా నైపుణ్యాలను సముపార్జించాలి. వీటినే బిజినెస్ స్కిల్స్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ మూలస్తంభాల్లాంటివి. వీటిని మాక్రో స్కిల్స్‌గా పేర్కొంటారు. ఈ నాలుగు లేకుండా పూర్తిస్థాయిలో సమాచార మార్పిడి జరగదు. ఎల్, ఎస్, ఆర్, డబ్ల్యూ... స్కిల్స్ ఉంటే సుస్థిర కెరీర్ సొంతమైనట్లే! వొకాబ్యులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్‌లను మైక్రో స్కిల్స్ అంటారు. ఇవి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ సమర్థవంతంగా జరిగేందుకు ఉపయోగపడతాయి.
స్పీకింగ్ స్కిల్స్



ఉద్యోగం, కెరీర్ పరంగా ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో.. మాట్లాడటం కూడా అంతే ప్రధానం! ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన ఇంగ్లిష్‌లో సమాధానాలు ఇవ్వగలగాలి. సందర్భానికి అనుగుణంగా పదాల ప్రయోగం, వాక్య నిర్మాణం ఉంటే బోర్డు సభ్యులను ఇట్టే ఆకట్టుకోగలరు. ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నవారు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ముఖ్యంగా ఐటీ, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ రంగాల్లో రాణించాలంటే ఇంగ్లిష్ స్పీకింగ్ తప్పనిసరి. రోజూ తోటివారిని సమయానికి తగినట్లు ఇంగ్లిష్‌లో విష్ చేయాలి. 



ఇది ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్ మెరుగుపరచుకునే క్రమంలో తొలి అడుగు. ఇంగ్లిష్‌లో స్నేహితులతో మాట్లాడటం, ఇతరులకు అడ్రస్ చెప్పడం, మొబైల్‌లో మాట్లాడటం వంటివి చేస్తే స్పీకింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇంగ్లిష్‌లో పబ్లిక్ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులతో వాతావరణం గురించి ఇంగ్లిష్‌లో మంచి వొకాబ్యులరీతో చర్చించడం, ఏదైనా అంశంపై ఇంగ్లిష్‌లో డిబేట్ చేయటం వంటివన్నీ స్పీకింగ్ స్కిల్స్‌ను పెంపొందించేవే! వీటికోసం ‘టోస్ట్ మాస్టర్స్’ వంటి ఫోరమ్‌లలో సభ్యత్వం తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్ దినపత్రికల్లోని చిన్న చిన్న ఆర్టికల్స్‌ను చదివి, తిరిగి అద్దం ముందు నిలబడి చెప్పడం ద్వారా స్పీకింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: