ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే విద్యను అభ్యసించిన అనంతరం ఉద్యోగం పొందాలంటే ఏకైక మార్గం క్యాంపస్ ప్లేస్ మెంట్. మరి అప్పటివరకు చదవడం వేరు ఆ తర్వాత ఉద్యోగం సంపాదించడం వేరు. ఉద్యోగం సంపాదించడానికి అనేక లక్షణాలు ముఖ్యం అందులో మదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్కిల్స్. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించడానికి తమ ప్రొఫైల్ ఏ సంస్థకు సరితూగుతుంది? ఆయా సంస్థల్లో ఏ పోర్ట్‌ఫోలియోలో ఉద్యోగాలకు తమకు అర్హత ఉంటుంది అనే విషయాలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి. ఇన్‌స్టిట్యూట్‌లకు వచ్చే సంస్థల గురించి ప్లేస్‌మెంట్ సెల్స్‌కు సమాచారం అందుతుంది. ప్లేస్‌మెంట్ అధికారులను సంప్రదిస్తే ఆయా సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు.



ఉద్యోగార్థుల్లో సబ్జెక్ట్‌పై పట్టుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా అనే అంశాలపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సబ్జెక్టు నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు సర్టిఫికెట్లు, గ్రేడ్లు ప్రామాణికం కావు. కరిక్యులంలో లేని అంశాలపై కూడా ప్రాంగణ నియామక ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ప్రత్యేకత, దాని ఫలితాలు, లైవ్ ప్రాజెక్ట్/డమ్మీ ప్రాజెక్ట్ వంటివి తెలుసుకునేందుకు రిక్రూటర్లు పలు రకాల ప్రశ్నలు సంధిస్తారు. వీటిని ఎదుర్కోవడానికి తమ ప్రాజెక్ట్ వర్క్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి.



తమ సబ్జెక్టు నైపుణ్యాల ఆధారంగానే భవిష్యత్తులో విధులు నిర్వర్తిస్తామని విద్యార్థులు భావిస్తున్నారు. అయితే కొత్త ప్రాజెక్ట్‌లు, ఉత్పత్తులపై సంస్థలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఉద్యోగి అభిప్రాయాలు అడిగే సందర్భాలు ఎదురవుతాయి. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి. లాంగ్వేజ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, క్రాస్ కల్చరల్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ కోసం అవసరమైతే శిక్షణ తీసుకోవాలి. ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌లే ప్రత్యేకంగా సాఫ్ట్‌స్కిల్ ట్రెయినింగ్ సెల్స్ ఏర్పాటుచేస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. 



ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకోవడం, జాబ్ రెడీగా రూపొందడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ప్రొఫెషనల్ కోర్సుల స్థాయికి వచ్చిన విద్యార్థులు కేవలం తరగతికే పరిమితం కాకూడదు. సబ్జెక్టు నైపుణ్యాల పరంగా సమకాలీన పరిస్థితుల్లో వస్తున్న తాజా మార్పుల గురించి నిరంతరం అధ్యయనం చేయాలి. సందేహాల నివృత్తి కోసం ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: