ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలు పురోగమనంలో సాగుతున్నాయి. ఇదే సమయంలో ఆయా రంగాల్లోని పరిశ్రమలకు భారీ సంఖ్యలో కింది స్థాయిలో వృత్తి నైపుణ్యాలు (ఒకేషనల్ స్కిల్స్) ఉన్న అభ్యర్థుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలుగా పేర్కొనే ఆటోమొబైల్, ప్రొడక్షన్ నుంచి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వరకు వాస్తవ నైపుణ్యాలు, పరిశ్రమకు తగిన విధంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది. వాస్తవానికి బీటెక్, ఎంబీఏ చదివే విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే వాటిలో చేరని విద్యార్థుల సంఖ్య మూడు, నాలుగింతలు ఎక్కువే. 



వారు భవిష్యత్తులో తమకు లభించే అవకాశాల గురించి ఆందోళన చెందుతుంటారు. వీరిని గుర్తించి ఒకేషనల్ స్కిల్స్‌లో శిక్షణనిప్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా పరిశ్రమ అవసరాలు కూడా తీరతాయి. కింది స్థాయిలో ఒకేషనల్ స్కిల్స్ అవసరమైన సిబ్బంది కొరతను అధిగమించే క్రమంలో కంపెనీలు కూడా చొరవ చూపితే బాగుంటుంది. ఆయా సంస్థలు తమకు అవసరమైన విభాగాల్లో ఒకేషనల్ స్కిల్స్ అందించేలా ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అటు సంస్థకు, ఇటు అభ్యర్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 



ఈ క్రమంలోనే టాటా సంస్థ.. టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పింది. దీని ద్వారా హాస్పిటాలిటీ, ఆటో మొబైల్, బీపీవో, ఎలక్ట్రికల్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దే యత్నం చేస్తోంది. ఉన్నత స్థాయిలో అవసరాలకు ఉత్తీర్ణులు లభిస్తున్నారు. కానీ ఇదే సమయంలో జాబ్ స్కిల్స్ ఉండటం లేదనే అభిప్రాయం వాస్తవమే. విద్యార్థులు తొలి ఏడాది నుంచే తాము ఎంపిక చేసుకున్న బ్రాంచ్/ కోర్సుకు సంబంధించి రియల్ టైం నాలెడ్జ్ పెంచుకునేందుకు కృషి చేయా లి. 



వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయ త్నించాలి. కేవలం క్లాస్‌రూం లెర్నింగ్‌కు పరిమితం కాకుండా పరిశ్రమలో మారుతున్న పరిస్థితులను నిరంతర అధ్యయనం చేయాలి. దీనికోసం ఇప్పు డు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. జర్నల్స్, ఇంటర్నెట్ రిసోర్సెస్, సెమినార్స్, వర్క్‌షాప్స్ ఇలా అపారమైన మార్గాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: