యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,528 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నియామక నిబంధనలు ఎలా ఉండాలన్న అంశాలపై దృష్టి సారించింది. అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన నిబంధనలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యాపకుల నియామకాల నిబంధనలను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. 


Image result for telangana gov

ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై చర్చించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు నియామకాల కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


Image result for telangana gov asisitent professor notification

దీంతో యూనివర్సిటీల్లో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అయితే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలంటే కచ్చితంగా వైస్ చాన్స్‌లర్ ఉండాల్సిందే. ఇటీవల 10 వర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇపుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డెరైక్టు రిక్రూట్‌మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: