తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 12 పట్టణాల్లోని 96 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో ఏపీలో 29 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 56,153 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అందులో తెలంగాణ నుంచి 38,214 మంది, ఏపీ నుంచి 17,939 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. 


Image result for eamcet 3 telangana

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులను పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించబోమని వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 9 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రంతోపాటు కార్బన్‌లెస్ ఓఎంఆర్ కాపీ దాని కిందే ఉంటుందని, కన్వీనర్ కాపీని పరీక్ష కాగానే హాల్లో అందజేయాలని, అభ్యర్థి కాపీని (కార్బన్‌లెస్ కాపీ) అభ్యర్థి వెంట తీసుకెళ్లవచ్చని వివరించారు. 


Image result for eamcet 3 telangana

విద్యార్థుల వేలి ముద్రలు సేకరించేందుకు వీలుగా చేతులపై మెహందీ, టాటూ వంటివేవీ లేకుండా చూసుకోవాలని పేర్నొన్నారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే పరీక్ష రాయాలని, ఇతర రంగుల పెన్నులను అనుమతించరని పేర్కొన్నారు. ఓఎంఆర్ జవాబుపత్రంపై రబ్బర్‌తో రుద్దినా, వైట్‌నర్ ఉపయోగించినా జవాబు పత్రం మిషన్ మూల్యాంకనం చేసే అవకాశం పోతుందని వివరించారు. విద్యార్థి పరీక్ష హాల్లోకి వచ్చేటప్పుడు బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, పూర్తి చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం, హాల్‌టికెట్, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తుల సమయంలో అందజేయకపోతే కుల ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: