ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు విభాగంలో మెకానిక్, డ్రైవర్ (కానిస్టేబుల్) ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ పోలీసు నియామక మండలి శుక్రవారం(సెప్టెంబరు 2) ప్రకటన జారీ చేసింది. మొత్తం 25 మెకానిక్, 134 డ్రైవరు పోస్టులకు ఈ ప్రకటన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ వెల్లడించారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు మూడో వారంలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు మూడో వారంలో తుది రాత పరీక్ష ఉంటుంది. పురుష అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష ఏమీ ఉండదు. 
పూర్తి వివరాలు 


Image result for ap police

* దరఖాస్తుల స్వీకరణ: 13.09.2016 నుంచి 13.10.2016 సాయంత్రం 5 గంటల వరకూ.
* మెకానిక్ పోస్టులకు: పదో తరగతితో పాటు ఐటీఐ (వైర్‌మెన్, మెకానికల్ మెటార్ వెహికల్, మెకానికల్ డీజిల్, ఫిట్టర్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో)
* డ్రైవర్ పోస్టులకు: ఇంటర్మీడియట్ లేదా పదో తరగతితో పాటు ఐటీఐ (వైర్‌మెన్, మెకానికల్ మోటార్ వెహికల్, మెకానికల్ డీజిల్, ఫిట్టర్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో), రెండేళ్లుగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.
* మెకానిక్ పోస్టులకు 18-22 ఏళ్లు మధ్య, డ్రైవర్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య వయోపరిమితి కలిగిన వారు అర్హులు.
* శారీరక సామర్థ్య, దారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు మెకానిక్ పోస్టులకైతే 100 మార్కులకు ట్రేడ్ టెస్ట్, డ్రైవర్ అభ్యర్థులకైతే 100 మార్కులకు డ్రైవింగ్ పరీక్ష ఉంటాయి.
* ఎంపికైన అభ్యర్థులకు 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: