పేపర్ - 3: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్-1కి సంబంధించి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయ భావనలు - కొలిచే ప్రమాణాలు, నిరుద్యోగం, పేదరికం భావనలు - వాటి నిర్వచనాలు, నిరుద్యోగ నిర్మూలనకు చేపడుతున్న పథకాలు, పంచవర్ష ప్రణాళికలు-వాటి లక్ష్యాలు తదితరాలను చదవాలి. 
సెక్షన్-2కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం- భౌతిక వనరులు, పట్టణీకరణ భావనలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులు, అక్షరాస్యత రేటు (స్త్రీ-పురుష అక్షరాస్యత రేటు, పట్టణ-గ్రామీణ ప్రాంత అక్షరాస్యత రేటు), వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, పశు పోషణ, మత్స్య సంపదల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మైనింగ్, తయారీ, సహజ ఇంధన వనరుల లభ్యత, నీటిపారుదల వ్యవస్థలను అధ్యయనం చేయాలి. సేవా రంగం అంశాలపైనా దృష్టిపెట్టాలి.
సెక్షన్ -3కి సంబంధించి సామాజిక అసమానతలు, కుల, వర్ణ, మత పరమైన వివక్షలు, కారణాల విశ్లేషణతో పాటు ప్రధానంగా ఈ విభాగంలో ఆర్థిక సంస్కరణల గురించి అధ్యయనం చేయాలి. 


Image result for group 2

పేపర్-4: ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’
సెక్షన్-1లో పేర్కొన్న ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారితీసిన పరిస్థితులు, ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాలను అధ్యయనం చేయాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, పరిణామాలు, భూదానోద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు, 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన పరిస్థితుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
సెక్షన్-2కు సంబంధించి జై ఆంధ్ర ఉద్యమం, రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/పార్టీలు, ముల్కీ నిబంధనలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. 
సెక్షన్-3 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ఏర్పాటు-అందుకు దారి తీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల రిపోర్ట్‌లను అధ్యయనం చేయాలి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలను తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: