ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీస్) ఆఫీసర్లు(స్కేల్ - 1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 16,560 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు...: 
ఆఫీస్ అసిస్టెంటు్ల : 8824 
ఆఫీసర్స్ స్కేల్ -1 : 5539
ఆఫీసర్స్ స్కేల్ -2 : 1999
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్: 1533
అగ్రికల్చరల్ ఆఫీసర్: 152
మార్కెటింగ్ ఆఫీసర్: 75
ట్రెజరీ మేనేజర్: 19
లా ఆఫీసర్: 55
చార్టర్డ్ అకౌంటెంట్: 35
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్: 130
ఆఫీసర్స్ స్కేల్ -3 : 198


Image result for rural bank jobs

అర్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్: వయసు 2016, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 28 ఏళ్లు. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఆయా బ్యాంకులున్న ప్రాంతాన్ని బట్టి, నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్థానిక భాషలో ప్రావీణ్యత అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం అభిలషణీయం.
ఆఫీసర్ స్కేల్ 1: వయసు 2016, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసీకల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యమిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు.


Image result for rural bank jobs

ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): వయసు 2016, సెప్టెంబర్ 1 నాటికి 21-32 ఏళ్లు. కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసీకల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో రెండేళ్లపాటు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ 2 (స్పెషలిస్టు ఆఫీసర్లు): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్‌సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచిల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఏఎస్‌పీ.నెట్, పీహెచ్‌పీ, సీ++, జావా, వీబీ, వీసీ, ఓసీపీ తదితరాల్లో సర్టిఫికెట్ అభిలషణీయం. ఏడాది అనుభవం అవసరం.
చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగానికి సీఏ, ఏడాది అనుభవం అవసరం. లా ఆఫీసర్‌కు కనీసం 50 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. రెండేళ్లకు తక్కువ కాకుండా ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్వకేట్ /లా ఆఫీసర్‌గా అనుభవం ఉండాలి.
ట్రెజరీ మేనేజర్‌కు సీఏ/ఎంబీఏ (ఫైనాన్స్)తో పాటు ఏడాది అనుభవం అవసరం. మార్కెటింగ్ ఆఫీసర్‌కు ఎంబీఏ (మార్కెటింగ్), ఏడాది అనుభవం ఉండాలి. అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చర్/హార్టికల్చర్/డెయిరీ/యానిమల్ హజ్బెండరీ/ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/పిసీకల్చర్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.


Image result for rural bank jobs

ఆఫీసర్ స్కేల్ 3: వయసు 2016, సెప్టెంబర్ 1 నాటికి 21-40 ఏళ్లు. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసీకల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ కోర్సుల్లో డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బ్యాంకు/ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆఫీసర్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం.
గమనిక: గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ఎగ్జామ్ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్ దశలు ఉంటాయి. అసిస్టెంట్స్ పోస్టులను మెయిన్స్‌లో సాధించే స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు మెయిన్స్, కామన్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్కేల్ -2, 3 పోస్టులను సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష, కామన్ ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: