సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఔపోసన పట్టాలి. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుని తార్కికంగా, విశ్లేషణాత్మకంగా, విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; విషయ అవగాహనకు సంబంధించినవి, విషయ అనువర్తనకు సంబంధించినవి.


Image result for appsc

జ్ఞానాత్మకమైన వి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి: ఈ తరహా ప్రశ్నలు ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థి పరిజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే విస్తృత పఠనంతో పాటు పునశ్చరణ అవసరం. ఈ ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతుంది. 
విషయ అవగాహనకు సంబంధించినవి: కొన్ని ప్రశ్నలు అభ్యర్థి అవగాహన, తెలివితేటలను పరీక్షిస్తాయి. ఇవి రెండూ నిరంతర సాధన, ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమవుతాయి.
విషయ అనువర్తనకు సంబంధించినవి: ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతైన ఆలోచనతో పాటు సహజ ప్రతిభ, విచక్షణాశక్తులను ఉపయోగించాలి. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి అప్లికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: