భారీ వర్షాల కారణంగా నెట్‌వర్క్ దెబ్బతినడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. శుక్రవారం దరఖాస్తుల చివరి తేదీ కావడంతో వేల మంది అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసినా, ఫీజు చెల్లించి సబ్మిట్ చేయలేకపోయారు. అలాంటి వారంతా ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. గతంలోనే గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5.65 లక్షల మంది ఉన్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య 7.48 లక్షలకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: