దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో బోధ‌న‌లో వివిధ స‌బ్జెక్టులు, విభాగాల్లో 2072 పోస్టుల భ‌ర్తీకి న‌వోద‌య విద్యాలయ స‌మితి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక‌చేస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తివివ‌రాలు తెలుసుకుందాం.

ఖాళీల వివ‌రాలు:
అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ 2
ప్రిన్సిపాళ్లు 40
పీజీటీలు 880
టీజీటీలు 660
థ‌ర్డ్ లాంగ్వేజ్ టీచ‌ర్లు 235
ఇత‌ర విభాగాలు 255

అర్హత‌లు: 
అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టుల‌కు పీజీతోపాటు ప్రిన్సిపాల్ హోదాలో ప‌నిచేసిన అనుభ‌వం లేదా విద్యా సంస్థల్లో క‌నీసం అయిదేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. జులై 31 నాటికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 45 ఏళ్లు.
ప్రిన్సిపాల్ పోస్టుల‌కు 55 శాతం మార్కుల‌తో పీజీతోపాటు బీఎడ్ ఉండాలి. క‌నీసం ప‌దేళ్లు పీజీటీగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. రెసిడెన్షియ‌ల్ విధానంలో ప‌నిచేసిన‌వారికి ప్రాధాన్యం.
పీజీటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న స‌బ్జెక్టులో క‌నీసం 55 శాతం మార్కుల‌తో పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. ఈ పోస్టుల‌కు జులై 31 నాటికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 35 ఏళ్లు. 
టీజీటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌బ్జెక్టులో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు బీఎడ్ త‌ప్పనిస‌రి. 
ఇత‌ర విభాగాల్లో పోస్టుల‌కు సంబంధిత విభాగానికి చెందిన కోర్సులు పూర్తిచేసి ఉండాలి. ఈ పోస్టుల‌కు జులై 31 నాటికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 35 ఏళ్లు.
థ‌ర్డ్ లాంగ్వేజ్ టీచ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే భాష‌ను డిగ్రీలో చ‌దివుండాలి. దీంతోపాటు బీఎడ్ పూర్తిచేయాలి. ఈ పోస్టుల‌కు జులై 31 నాటికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 35 ఏళ్లు.
పై అన్ని పోస్టుల‌కు ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ప‌రీక్ష ఇలా...
అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, ప్రిన్సిపాల్ పోస్టుల‌కు
పార్ట్ -1 రీజ‌నింగ్ ఎబిలిటీలో 20 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి 20 మార్కులు. పార్ట్‌-2 జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు వీటికి 40 మార్కులు. పార్ట్‌-3 జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ హిందీ (లాంగ్వేజ్ టెస్టు) ఒక్కో స‌బ్జెక్టులో 20 చొప్పున 40 ప్రశ్నలు వీటికి 40 మార్కులు. పార్ట్ -4 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులు. పార్ట్‌-5 ఎడ్యుకేష‌న‌ల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేష‌న్ 60 ప్రశ్నలు 60 మార్కులు. మొత్తం 180 ప్రశ్నల‌కు 180 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు.

పీజీటీ, టీజీటీ, ఇత‌ర విభాగాలు, థ‌ర్డ్ లాంగ్వేజ్ పోస్టుల‌కు
వీరంద‌రికీ ప్రశ్నప‌త్రం ఉమ్మడిగా ఉంటుంది. జ‌న‌ర‌ల్ హిందీ, ఇంగ్లిష్ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున మొత్తం 40, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 30, జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్ 30, టీచింగ్ ఆప్టిట్యూడ్ 20, సంబంధిత స‌బ్జెక్టులో 80 ప్రశ్నలు వ‌స్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం ప్రశ్నప‌త్రానికి 200 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంట‌లు

తుది నియామ‌కాలు ఇలా..
రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. టీటీటీ, ఇత‌ర పోస్టులు, థ‌ర్డ్ లాంగ్వేజ్ టీచ‌ర్ పోస్టుల‌కు మాత్రం రాత‌ప‌రీక్ష ఆధారంగా నియామ‌కాలు ఉంటాయి. పీజీటీ, ప్రిన్సిపాల్‌, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూలు చేప‌డ‌తారు. ఎంపికైన‌వాళ్లు దేశంలో ఏదైనా జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యంలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ప్రొబేష‌న్ వ్యవ‌ధి రెండేళ్లు.

ద‌ర‌ఖాస్తు..ఫీజు..ప‌రీక్ష కేంద్రాలు..
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 9
ప‌రీక్ష ఫీజు: అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, ప్రిన్సిపాల్ పోస్టుల‌కు రూ.1500; మిగిలిన అన్ని పోస్టుల‌కు రూ.1000.
ప‌రీక్షలు: ఈ ఏడాది న‌వ‌రంబ‌ర్‌, డిసెంబ‌రుల్లో నిర్వహిస్తారు. (ప‌రీక్ష తేదీల షెడ్యూల్‌ను త‌ర్వాత ప్రక‌టిస్తారు)
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం

వెబ్‌సైట్‌: www.mecbsegov.in


మరింత సమాచారం తెలుసుకోండి: