భారత తపాలా విభాగం ఆధ్వర్యంలో ఇటీవలే ఏర్పడిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) వివిధ కేడర్లలో ఉద్యోగుల నియామకానికి ఏక కాలంలో ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ప్రకారం స్కేల్-1, 2, 3, 4, 5, 6, 7 ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీవో), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)/మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో స్కేల్-1, 2, 3 ఆఫీసర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి.