దేశవ్యాప్తంగా వివిధ కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు,పరిశోధన సంస్థల్లో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్లలో పీహెచ్డీ చేస్తూ ప్రతినెలా జేఆర్ఎఫ్ పొందాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. సీబీఎస్ఈ - యూజీసీ నెట్. యూనివర్సిటీలు/డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక పరీక్షలకు అర్హత సాధించాలన్నా నెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) - 2017 ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు...