తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఆవిర్భావంతో రెవెన్యూ శాఖలో కొత్తగా 2,109 ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించింది. రాష్ట్రంలో ఈ నెల 11న కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల్లో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని అదనంగా నియమించాల్సి ఉండడంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలో కొత్తగా 2109 ఉద్యోగాలను సృష్టించారు.