అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో 2,06,582 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ. అమెరికా వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎం) కోర్సులు అభ్యసిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా వలస, కస్టమ్స్ అదుపు సంస్థ(ఈసీఈ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నవంబరు 2016 నాటికి 12.3 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8697 విద్యాసంస్థల్లో చదువుతున్నారు