ప్రతిష్ఠాత్మక క్యాట్‌-2016 ఫలితాలు జనవరి 9న విడుదలయ్యాయి. ఫలితాల్లో.. ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న 20 మంది అభ్యర్థులు అగ్రస్థానంలో నిలిచారని ఈ పరీక్ష నిర్వహణలో సమన్వయ సంస్థగా వ్యవహరించిన ఐఐఎం-బెంగళూరు తెలిపింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర బిజినెన్‌ స్కూళ్లలో ప్రవేశానికి క్యాట్‌(కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఫలితాల వివరాలను అభ్యర్థుల మొబైల్‌ ఫోన్లకు సందేశాల రూపంలో పంపినట్టు క్యాట్‌-2016 కన్వీనర్‌ ఆచార్య రాజేంద్ర తెలిపారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ఐఐఎంబీ ఓ ప్రకటనలో తెలిపింది. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు బృంద చర్చలు, మౌఖిక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: