యూజీ, పీజీ కోర్సుల్లో చేరికలకు సంబంధించి, 2017-18 విద్యా సంవత్సరానికి ఎనిమిది ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గురువారం (జనవరి 12) వెల్లడించారు. వీటన్నింటినీ మే నెలలోనే నిర్వహిస్తుండటం గమనార్హం. ఇప్పటివరకూ ఎంసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతుండగా ఈసారి ఈసెట్ మొదటి పరీక్ష కానుంది. 

* ఆ రెండూ ఆన్‌లైన్‌లోనే...అధికారికంగా ప్రకటించకున్నా ఈసెట్, పీజీఈసెట్‌లను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేఎన్‌టీయూహెచ్ అనుమతులు సక్రమంగా పూర్తయితే, జూన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి జులైలోనే తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను త్వరగా నిర్వహిస్తే, డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు కూడా సకాలంలో జరుగుతాయని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: