ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) దక్షిణ ప్రాంతీయ కార్యాలయం దేశ ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటీసెస్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రక‌ట‌న ద్వారా 89 టెక్నీషియ‌న్‌ అప్రెంటీస్/ ట్రేడ్ అప్రెంటీస్ - ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 21 ఖాళీలున్నాయి. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ విభాగాలున్నాయి.


Related image

టెక్నీషియ‌న్‌ అప్రెంటీస్‌- మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ విభాగాల‌కు 12 నెలలు, ట్రేడ్ అప్రెంటీస్‌- ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌కు 18 నెలల పాటు శిక్షణ ఉంటుంది. టెక్నీషియ‌న్ అప్రెంటీస్‌కు రూ.7530, ట్రేడ్‌ అప్రెంటీస్‌- ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌కు రూ.6970 స్టయిపండ్ ఇవ్వనున్నారు. ద‌ర‌ఖాస్తుకు సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ విద్యార్హతతో పాటు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్‌ టెస్ట్ ద్వారా అభ్యర్థుల‌కు ఎంపిక చేయ‌నున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ‌ ఫిబ్రవ‌రి 1న‌ ప్రారంభ‌మై.. ఇదే నెల 13వ తేదీతో ముగియ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: