ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్య ప్రవేశ పరీక్ష(2017-18)లు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు మంగళవారం(జనవరి 17) అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మేరకు ఏపీ ఆన్‌లైన్(టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో) ద్వారానే ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇదే నిర్ణయాన్ని వృత్తివిద్య ప్రవేశపరీక్షల నిర్వహణకు వర్తింపజేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితాడావ్రా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయం 2017-18 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది.


Image result for online exam

ఉత్తర్వుల్ని అనుసరించి ఏపీ ఉన్నత విద్యామండలి ఏపీ ఆన్‌లైన్‌తో త్వరలోనే ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. సేవల రుసుము, ఇతర అంశాలపై ఏపీ ఆన్‌లైన్‌తో చర్చలు జరిపేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎ.వల్లికుమారి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేశారు. తాజా పరిణామంతో త్వరలోనే ఇంజినీరింగ్, ఐసెట్, పీజీ ఇంజినీరింగ్, ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్ని ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు ప్రవేశపరీక్షల నిర్వహణ కన్వీనర్లతో ఏపీ ఉన్నత విద్యామండలి బుధవారం (జనవరి 18) సమావేశం కాబోతుంది. తెలంగాణాలో ఇప్పటికే తేదీల్ని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: