తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి సంబధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే వెలువరించనున్నట్టు ఆ రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. వీటికి సంబంధించిన కొన్ని వివరాలు తమకు అందాయని, మరికొన్ని వివరాలు ఆయా శాఖల నుంచి రావాల్సి ఉందన్నారు. అవి రాగానే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. 2011 గ్రూప్‌-1కు సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటాయనీ, వాటి ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 


Image result for tspsc

గురువారం (జ‌న‌వ‌రి 19) పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులతో కలిసి ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వార్షిక నివేదికను అందజేశారు. ఇప్పటివరకు తాము నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, భ‌ర్తీ చేసిన ఉద్యోగాల‌కు సంబంధించిన‌వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు చెప్పారు. అంతేకాకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గడిచిన ఏడాది కాలంలో సాధించిన ప్రగతితో పాటు అన్నివివరాలను ఆ నివేదికలో పేర్కొన్నట్టు వివరించారు. ఇప్పటివరకు త‌మ ప‌నితీరు ప‌ట్ల‌ గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారనీ, మరింత ప్రగతిశీలంగా పురోగామి దిశగా పనిచేయాలని ఆకాంక్షించారన్నారు. త్వరలోనే గ్రూప్‌-2 ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చక్రపాణి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: