సౌత్ ఇండియ‌న్ బ్యాంకు 201 స్కేల్‌1 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప్రథ‌మ శ్రేణి మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుల‌కు అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఫిబ్రవ‌రిలో ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం. అర్హత‌:అభ్యర్థులు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీల్లో 60 శాతం మార్కులు సాధించడం త‌ప్పనిస‌రి. డిసెంబ‌రు 31, 2016లోగా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


Image result for south indian bank

వ‌యోప‌రిమితి: డిసెంబ‌రు 31, 2016 నాటికి 25 ఏళ్లకు మించ‌రాదు. అంటే జ‌న‌వ‌రి 1, 1992 - డిసెంబ‌రు 31, 1996 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో మూడేళ్లు స‌డ‌లింపు. ఏదైనా ప‌బ్లిక్‌/ ఫ్రైవేట్ బ్యాంకులో క‌నీసం రెండేళ్లు క్లర్క్‌గా ప‌ని అనుభ‌వం ఉన్నవారికి వ‌యోప‌రిమితిలో మూడేళ్లు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు. ఇంట‌ర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారా తుది నియామ‌కానికి ప్రాధాన్యమిస్తారు.


Image result for south indian bank

ఎంపికైతే:ఉద్యోగంలోకి చేరిన‌వాళ్లు క‌నీసం మూడేళ్లపాటు విధుల్లో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. ఈ మేర‌కు ఒప్పంద‌ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ధ్యలో వైదొలిగితే రూ.1,50,000 చెల్లించాలి. అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. రూ.23700-42020తో వేత‌న శ్రేణి మొద‌ల‌వుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ఇత‌ర ఆల‌వెన్సులు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జ‌న‌వ‌రి 19ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 27ఆన్‌లైన్ ప‌రీక్ష: ఫిబ్రవ‌రిలోతెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, గుంటూరు, కాకినాడ‌, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌.

మొత్తం పోస్టులు: 201ప‌రీక్ష ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.700, ఎస్సీ, ఎస్టీల‌కు రూ.150

వెబ్‌సైట్‌: www.southindianbank.com


మరింత సమాచారం తెలుసుకోండి: